📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
HomeతెలంగాణJayashankar Bhupalpallyకొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు...

కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు

📰 Generate e-Paper Clip

కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు


ఈరోజు భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు  కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లు, రికార్డులు, పిటిషన్లు, కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి స్వీకరించే పిటిషన్లను సకాలంలో పరిశీలించి, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.

అలాగే స్టేషన్‌లోని అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యతను పాటిస్తూ చట్టపరమైన విధానాలకు అనుగుణంగా కేసులను విచారించాలని సూచించారు.

అనంతరం ఆన్‌లైన్‌లో నమోదైన కేసుల స్థితిగతులను (Case Status) పరిశీలించి, దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసును సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular