📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కూటమి పాలనలో రైతులకు కష్టాలు - కాకాణి

కూటమి పాలనలో రైతులకు కష్టాలు – కాకాణి

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16)శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం,తోటపల్లి గూడూరు మండలం,వరిగొండ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.కూటమి పాలనలో రైతులు అన్ని విధాల,అష్ట కష్టాల పాలవుతున్నారు-రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక,అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు రైతులు ఆరుగాలం శ్రమించి,పండించిన ధాన్యం దళారుల పాలయింది కూటమి నేతలు మాత్రం రైతులు తమకు గిట్టుబాటు ధర లేదని వెళ్లడిస్తే పుట్టి (850 కేజీలు) 50 వేలుకు అమ్మాలా,అని ఎగతాళిగా మాట్లాడుతున్నారంటూ కాకాణి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఇటీవల మృతి చెందిన వైఎస్ ఆర్ సీపీ యువ నేత సుమన్ రెడ్డి మాతృ మూర్తి సుజాతమ్మ ,మరియు తూపిలి శ్రీధర్ రెడ్డి ల గారి చిత్ర పటాల కు నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకాణి కూటమి పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక,తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చంద్రబాబు నాయుడు వ్యవసాయం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు చంద్రబాబుకు ఏనాడు రైతుల సమస్యలు పట్టవు చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానమంతా వ్యవసాయం చేయడం దండగా అన్నట్టుగానే వ్యవహరిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుట్టి ధాన్యం (850 కేజీలు) 25 వేల రూపాయల చొప్పున అమ్మితే,ఉక్రెయిన్ యుద్ధం వల్ల రేట్లు పెరిగాయని ఆనాడు మాట్లాడారు రైతులు పండించిన ధాన్యానికి నేడు పుట్టి (850 కేజీలు) 16 వేల రూపాయల లెక్కన రైతులు తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే,ఇరాన్ యుద్ధం వల్ల రేట్లు పడిపోయాయని మాట్లాడడం హాస్యాస్పదం యుద్ధాలను కూడా కూటమి ప్రభుత్వంలో,నేతలు తమకు అనుకూలంగా మరల్చుకుని మాట్లాడుతున్నారు  రైతులకు యూరియా అందక,సాగునీరు సాఫీగా చేరక అనేక అవస్థలు పడ్డారు రైతుల పేరిట అధికార పార్టీ నేతలు ఇరిగేషన్ లో దొంగ బిల్లులు చేసుకుని దోచుకోవడంతో,తమ సొంత నిధులతో రైతులు,కాలువలకు మరమ్మత్తులు చేపట్టి, సాగునీరు పారుదలకు చర్యలు చేపట్టారు రైతులను అడ్డుపెట్టుకొని అన్ని విధాల కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుంది రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులు దోచుకుంటుంటే చోద్యం చూస్తూ,కూటమి నేతలు,అపహస్యం చేస్తూ మాట్లాడుతున్నారు భవిష్యత్తులో రైతులు కూటమి ప్రభుత్వానికి తగురీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రైతుల పట్ల,వ్యవసాయం పట్ల,అత్యంత శ్రద్ధ చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి  రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తూ,సంపూర్ణ, సహాయ సహకారాలు, అందిస్తాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular