కాకతీయ ఆస్పత్రిపై దాడిని తీవ్రంగా ఖండించిన
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.ఆశోక్ కుమార్
మేడిపల్లి జూన్ 20( మన ప్రజావాణి)రోగులకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న కాకతీయ ఆస్పత్రిపై జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎంఏ) ఉప్పల్ శాఖ తీవ్రంగా ఖండించింది.ఆస్పత్రులు, వైద్యులు,వైద్య సిబ్బందిపై దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై దాడులు చేయడం బాధాకరమని అన్నారు.కాకతీయ హస్పిటల్ లో జరిగిన సంఘటన దురదృష్ట
కరమన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించు
కోవాలని,హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని సూచించారు.ఆస్పత్రుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి,దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కాకతీయ హస్పిటల్ పై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.ఆశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వి.ప్రసాద్, సభ్యులు డాక్టర్ వేణుగోపాల్ రావు,డాక్టర్ మహేష్ రెడ్డి, డాక్టర్ మాధవి,కాకతీయ ఆస్పత్రి సీఈవో టి. హరిప్రసాద్,డాక్టర్ సతీష్, డాక్టర్ సంతోష్,కాకతీయ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ ఆస్పత్రిపై దాడిని తీవ్రంగా ఖండించిన
RELATED ARTICLES



