📄 ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaధాన్యం కొనుగోలులో దగా రైతు భరోసాకు కోతలు గజ బింకర్ రాజన్న

ధాన్యం కొనుగోలులో దగా రైతు భరోసాకు కోతలు గజ బింకర్ రాజన్న

📰 Generate e-Paper Clip

ధాన్యం కొనుగోలులో దగా.. రైతు భరోసాకు కోతలు : గజ బింకర్ రాజన్న
తంగళ్లపల్లి, జూన్ 21 (ప్రజావాణి): ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్ల బోనస్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ బింకర్ రాజన్న ఆరోపించారు.
తంగళ్లపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 33 రకాల సన్న వడ్లకు బోనస్ అందించామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కేవలం ఏడు రకాలకే పరిమితం చేసి రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అన్ని రకాల సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందన్నారు.
రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఎరువుల పంపిణీలో సరైన ప్రణాళిక లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సన్న వడ్ల బోనస్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ వైఫల్యాన్ని బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి, గతంలో ప్రకటించిన విధంగా అన్ని 33 రకాల సన్న వడ్లకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. రైతులతో విరోధంగా వ్యవహరించిన ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదని పేర్కొంటూ, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular