ఉద్యమకారులకు న్యాయం చేయాలి
ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాపోలు రాములు
బోడుప్పల్ లో ఎస్పీ,ఎస్టీ సంక్షేమ సంఘం సమావేశం
మేడిపల్లి జూన్ 20 (మన ప్రజావాణి) రాష్ట్ర సాధనలో నిర్విరామంగా పోరాడిన ఉద్యమకారులందరికి న్యాయం చేయాలని ఉప్పల్ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటి చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు అన్నారు. శనివారం బోడుప్పలోని ఆయన నివాసం వద్ద సంఘం అధ్యక్షులు బైగల్ల జంగయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాపోలు రాములు హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప్పల్ ప్రాంతంలో తెలంగాణ కోసం ఉద్యమం చేయాలంటే ఎవ్వరూ ముందుకు వచ్చేవారు లేరని,అలాంటి సమయంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న అన్ని పార్టీల నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశామన్నారు. నిజాయితీగా రాష్త్ర సాధనలో ఉద్యమించిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.ఉద్యమంలో లేని వారికి ఆశించిన ఫలితం దక్కిందని,రాష్ట్ర సాధనకోసం వేలాది మంది ఉద్యమకారులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఉద్యోగాలు,ఉపాధిని కూడా కోల్పొయారన్నారు.ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తుల కుటుంబాలు మాత్రం బంగారమ
యమైయ్యాయన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన ఉద్యమకారుల జీవితాలు పూర్తిగా దిగజారిపోయాయని అలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాపోలు రాములు వెల్లడించారు.మేని ఫేస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమ కారులందరికి ఇళ్లు,పెన్షన్ తదితర సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేయాలని రాపోలు రాములు పిలుపునిచ్చారు.త్వరలో సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఉద్యమకారులకు జరిగిన అన్యాయాలపై మరోసారి ఉద్యమించాల్సిన అంశాలపై కార్యాచరణను రూపొందించాలని రాపోలు రాములు సూచించారు. ఉద్యమకారుల చేసే పోరాటానికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బైగల్ల జంగయ్య, ప్రధాన కార్యదర్శి కండవల్లి నర్సింగరావు,ఉపాధ్యక్షులు తోకట నరేశ్,ముత్యాల చిన్న నర్సింహ్మా,వంగూరి నర్సింగరావు,సంయుక్త కార్యదర్శి కొంగర శ్రీనివాస్, కోశాధికారి ఎన్.చంద్రయ్య, కార్య నిర్వాహక కార్యదర్శులు గంజాయి నర్సింగరావు.సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏ.రాజు,సభ్యులు నాగోలు వీరస్వామి లతో పాటు బిఎస్పి నాయకులు జి. నర్సింగరావు,టి.బాలకృష్ణ, మీసాల భరత్ కుమార్.
ఎన్.వీరస్వామి,శివ,డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు న్యాయం చేయాలి
RELATED ARTICLES




