కడప మెగా సోలార్ పార్క్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..4వ స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీ” సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప,జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ (1000 మెగావాట్లు) పరిధిలో స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన "4వ స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీ" సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.సోలార్ పార్క్ పరిధిలో ప్రభావిత గ్రామాలు, ప్రభావితం కాని గ్రామాల అభివృద్ధికి...