📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఔషాపూర్‌ శివారులో రోడ్డు ప్రమాదం....జేసీబీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు...

ఔషాపూర్‌ శివారులో రోడ్డు ప్రమాదం….జేసీబీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు…

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 7: పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను జేసీబీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమరుగొముల గ్రామానికి చెందిన అలకుంట్ల వెంకటేశు (29), పంపరి మధు (27) శనివారం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్మలపేట రోడ్డు, ఔషాపూర్‌ శివారులోని ఆధునిక్‌ వెంచర్‌ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన జేసీబీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్‌కేసర్‌ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular