బెజ్జంకి, జూన్ 5 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ (AITUC) నాల్గవ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బెజ్జంకి మార్కెట్ యార్డులో హమాలీ సంఘం ఆధ్వర్యంలో మహాసభల కరపత్రాలనుఆవిష్కరించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏఐటీయూసీ దేశంలోని తొలి కార్మికసంఘమని,స్వాతంత్ర్యానికి ముందే ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం వంటి అనేక కార్మిక హక్కులను సాధించడంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ కార్మికుల హక్కుల కోసం పోరాడి సింగరేణి, ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్ తదితర రంగాల కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని,ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల ఉపాధికి భంగం కలిగిస్తోందని ఆరోపించారు.కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం తీవ్ర నష్టాన్నిఎదుర్కొంటోందనీ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బిక్షపతి, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్,హమాలీ నాయకులు పండుగ పరశురాములు, గంగుల బాలయ్య, బండి సమ్మయ్య, కుంభం రాములు, కనగండ్ల చంద్రయ్య, చౌదరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.




