📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ లో సత్తా చాటిన పేదింటి విద్యార్థి కాసల శ్రీ చైతన్య

జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ లో సత్తా చాటిన పేదింటి విద్యార్థి కాసల శ్రీ చైతన్య

📰 Generate e-Paper Clip

కాశినాయన జూన్ 5 ప్రజావాణి  మండలం రెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన కాసుల గురు ప్రసాద్, చెన్న కృష్ణమ్మల కూతురు శ్రీ చైతన్య జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ఆలిండియా ర్యాంక్ 2,823 (రోల్ నెంబర్ 266025026 ) సాధించి ప్రతిభను చాటారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక ఆర్థిక ఇబ్బందులతో నిరుపేదలైన తల్లిదండ్రుల కు ఐదు మంది ఆడపిల్లలు లో మొదటి బిడ్డ ఐన శ్రీ చైతన్య ఆల్ ఇండియా 2823 సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీ చైతన్య ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు రెడ్డి కొట్టాల లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య ను ప్రారంభించి, ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు నరసాపురంలోని ఏపీ మోడల్ స్కూల్లో పదవ తరగతిలో 600కు 538 మార్కులు సాధించడం, ఇంటర్మీడియట్ వెంకటేశ్వర కాలేజ్ పోరుమామిళ్ల పట్టణంలో 1000 మార్కులకు 969 మార్కులు సాధించి, అనంతరం వెంకటేశ్వర స్కూల్ యాజమాన్యం జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో ఆలిండియా ర్యాంకు 2823 ర్యాంకు సాధించడం అటు కుటుంబంలో, బంధుమిత్రులు అందరు కూడా సంతోషం తెలియజేశారు. చైతన్య తల్లిదండ్రులు పుట్టెడు కష్టాలతో ఐదు మంది ఆడబిడ్డలతో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడిన, మా ఇబ్బందులు పిల్లలు పడకూడదని వారికి చదివే ప్రధాన ఆయుధం అనే నిర్ణయించుకొని మా పెద్ద పాపను చాల కష్టపడి జేఈఈ అడ్వాన్స్ 2026 లో మంచి మార్కులు రావడం సంతోషమే, భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపదించాలనేదే మా ఆశయం అని వారు అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular