📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి..... బ్రూక్‌బాండ్ కాలనీలో 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాల...

ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి….. బ్రూక్‌బాండ్ కాలనీలో 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ పూర్తి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 27 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ 6వ డివిజన్ పరిధిలోని బ్రూక్‌బాండ్ కాలనీలో 312 నుంచి 319 వరకు ఉన్న పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిని కాంగ్రెస్ నాయకులు సోమవారం సమీక్షించారు.

ఘట్‌కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలకు అందజేసినట్లు వెల్లడించారు. మిగిలిన ఫారాల సేకరణను వేగవంతం చేసి, మిగిలిన ఆరు రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిచేయాలని బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలకు సూచించారు. ఓటర్లందరూ సహకరించి తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ 6వ డివిజన్ సమన్వయకర్త పాషా, ఎస్‌ఐఆర్ డైరెక్టర్ అశ్విన్ హాజరై బూత్‌ల వారీగా జరుగుతున్న పనులను పరిశీలించి, బీఎల్‌ఓలు–బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి గడువులోగా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మర్చందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడుపోళ్ల మల్లేష్, మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యుడు మీసాల సుధాకర్ రావు, మాజీ రైతు సమన్వయకర్త కొంతం అంజిరెడ్డి, మాజీ పీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, బృందావన్ బాబురావు, బ్రూక్‌బాండ్ కాలనీ పెద్ద సిరాజుద్దీన్, బొక్క సుధాకర్ రెడ్డి, చెన్నారెడ్డి, వివిధ బూత్‌ల బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular