ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి….. బ్రూక్‌బాండ్ కాలనీలో 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ పూర్తి

ఘట్‌కేసర్, జూలై 27 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ 6వ డివిజన్ పరిధిలోని బ్రూక్‌బాండ్ కాలనీలో 312 నుంచి 319 వరకు ఉన్న పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిని కాంగ్రెస్ నాయకులు సోమవారం సమీక్షించారు. ఘట్‌కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలకు అందజేసినట్లు వెల్లడించారు. మిగిలిన ఫారాల సేకరణను వేగవంతం చేసి, మిగిలిన ఆరు రోజుల్లో...