📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణWanaparthyఈవీఎంలు భద్రపరిచిన గోదాముకు కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాట్లు*  *జిల్లా కలెక్టర్...

ఈవీఎంలు భద్రపరిచిన గోదాముకు కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాట్లు*  *జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడి*

📰 Generate e-Paper Clip

*ఈవీఎంలు భద్రపరిచిన గోదాముకు కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాట్లు*

 

*జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వెల్లడి*

 

మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :

 

జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి తెలిపారు.బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్‌ గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు.ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం,వీవీ ప్యాట్‌ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం నెలవారి తనిఖీ లు చేసినట్లు వివరించారు.ఎన్నికల అధికారులు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular