📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammam*ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన డీసీఎచ్‌ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్

*ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన డీసీఎచ్‌ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్

📰 Generate e-Paper Clip

*ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన డీసీఎచ్‌ఎస్ డాక్టర్  కేసగాని రాజశేఖర్ గౌడ్


*జిల్లా కలెక్టర్ అనుదీప్ దు రిశెట్టి అంటున్న డాక్టర్ రాజశేఖర్ గౌడ్


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ కారణంగా అకస్మాత్తుగా కిందపడిపోవడంతో  అదే సమయంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న డి.సి.హెచ్.ఎస్ డాక్టర్  కేసగాని రాజశేఖర్ గౌడ్  పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు.
తక్షణమే బాధితుడి వద్దకు చేరుకుని అతని రక్తపోటును పరీక్షించి, పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్  ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలో బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడి, బాధితుడికి తక్షణమే తగిన మరియు మెరుగైన వైద్య చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ ఘటనలో డాక్టర్ రాజశేఖర్ గౌడ్ చూపిన మానవతా దృక్పథం, సేవాభావం మరియు సమయస్ఫూర్తి ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే డాక్టర్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” రోడ్ సేఫ్టీ కార్యక్రమం భాగంగా  జిల్లా కలెక్టర్ అనుదీప్  ఇచ్చిన విలువైన సూచనలు మరియు మార్గదర్శకాల మాకు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular