బెజ్జంకి, ఏప్రిల్ 19( ప్రజావాణి )
తేలంగాణ రాష్ట్రంలో వీస్తున్న వడగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ ప్రభుత్వాన్ని కోరారు.ధాన్యం అమ్మకానికి కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ, విశ్రాంతి కోసం షెడ్లు, అలాగే ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మండుటెండల మధ్య గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




