తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (మే03) నాయుడుపేట అధికారులకు మామూళ్ళు చెల్లిస్తాం… సచివాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం.ప్రశ్నించే ప్రజలపై జులుం ప్రదర్శిస్తాం.మేనకూరు గ్రామ సచివాలయంలో ప్రైవేటు వ్యక్తుల ఆగడాలపై ఆవేదన చెందుతున్న ప్రజానీకం.ప్రైవేటు వ్యక్తుల ప్రలోభాలకు దాసోహమైన అధికార గణం.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు జులుం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజానీకం. జిల్లా కలెక్టర్ దృష్టిసారించి ప్రైవేటు వ్యక్తుల ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్న ప్రజలు.ప్రభుత్వ సొమ్మును దోచుకుంటూ. ప్రభుత్వ అధికారులకు మామూళ్ళను కట్టబెడుతూ.ప్రజలపై జులుం ప్రదర్శిస్తూ. ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వ్యక్తులు శాసిస్తున్న వైనం తిరుపతి జిల్లా మేనకూరు గ్రామ సచివాలయంలో చోటు చేసుకుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న మేనకూరు గ్రామపంచాయతీని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు శాసిస్తున్నారనే చర్చ నడుస్తుంది. గ్రామ సచివాలయంలో గత కొద్ది సంవత్సరాల నుంచి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తిష్ట వేసుకుని ఇటు ప్రజలు అటు సిబ్బందిపై కర్ర పెత్తనం చెలాయిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం మండల స్థాయి అధికారులు ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే మామూళ్ళ మత్తులో జోగుతూ ప్రైవేటు వ్యక్తుల ఆగడాలకు ఆజ్యం పోస్తున్నారనే వాదన వినిపిస్తుంది. మేనకూరు గ్రామపంచాయతీ పరిధిలో పరిశ్రమలతో పాటు రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్న క్రమంలో సచివాలయాన్ని శాసిస్తున్న ప్రైవేటు వ్యక్తులు మామూళ్ళను వసూలు చేస్తూ సంబంధిత అధికారులకు కొంతమేరకు సమర్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారానే మండల స్థాయి అధికారులు మేనకూరు గ్రామ సచివాలయంలో జరుగుతున్న తంతును పట్టించుకోవడంలేదని ప్రజలు చర్చించుకోవడం విశేషం. గ్రామ సచివాలయంలో ప్రభుత్వ సిబ్బంది కూర్చునే కుర్చీలలో ప్రైవేటు వ్యక్తులు కూర్చుంటూ కంప్యూటర్లను వాడుకుంటూ ప్రజల యొక్క సమాచారాన్ని చెడగొడుతున్నారనే వాదనా వినిపిస్తుంది. ఇది ప్రశ్నించిన సచివాలయం సిబ్బందిపై ప్రైవేటు వ్యక్తులు జులుం ప్రదర్శిస్తున్నారని ప్రజలు చర్చించుకోవడం విశేషం. త్రాగునీటి సరఫరా యంత్రానికి వచ్చే డబ్బుల నుంచి పన్నులు వసూలు చేసే డబ్బులు వరకు ప్రైవేటు వ్యక్తులు స్వాహా చేస్తున్నారనే వాదనా వినిపిస్తుంది. పెద్ద మొత్తంగా వచ్చే పరిశ్రమలు మరియు రియల్ వ్యాపారాల మామూళ్ళను సచివాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు దండి మండల స్థాయి అధికారులకు మొట్ట చెబుతున్నారనే చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే మేనకూరు గ్రామ సచివాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు చర్చించుకోవడం విశేషం. ప్రజల రికార్డులను తారుమారు చేస్తూ సచివాలయం సిబ్బందిపై కర్ర పెత్తనం చలాయిస్తూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేటు వ్యక్తుల ఆగడాలను కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సచివాలయంలో జరుగుతున్న తంతుపై ప్రభుత్వ సిబ్బందిని పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులకే కట్టబెడితే సరిపోతుంది అనే విమర్శలు బాహాటంగా వ్యక్తమవడం విశేషం. ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిన అధికారులు మేనకూరు గ్రామ సచివాలయంలో ప్రైవేటు వ్యక్తులను కట్టడంలో మీనా మీషాలు లెక్కిస్తుండడంపై ప్రజల ఆరోపణలకు బలం చేకూరుతుందని వాదన వినిపిస్తుంది. జిల్లా కలెక్టర్ మేనకూరు గ్రామ సచివాలయం జరుగుతున్న ప్రైవేటు వ్యక్తులు ఆగడాలపై విచారణ చేపట్టి ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలబడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రైవేటు వ్యక్తుల ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులకు మామూళ్ళు చెల్లిస్తాం… సచివాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం.?
0
13
RELATED ARTICLES
- Advertisment -




