అధికారులకు మామూళ్ళు చెల్లిస్తాం… సచివాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం.?

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (మే03)  నాయుడుపేట అధికారులకు మామూళ్ళు చెల్లిస్తాం... సచివాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం.ప్రశ్నించే ప్రజలపై జులుం ప్రదర్శిస్తాం.మేనకూరు గ్రామ సచివాలయంలో ప్రైవేటు వ్యక్తుల ఆగడాలపై ఆవేదన చెందుతున్న ప్రజానీకం.ప్రైవేటు వ్యక్తుల ప్రలోభాలకు దాసోహమైన అధికార గణం.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు జులుం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజానీకం. జిల్లా కలెక్టర్ దృష్టిసారించి ప్రైవేటు వ్యక్తుల ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్న ప్రజలు.ప్రభుత్వ సొమ్మును దోచుకుంటూ. ప్రభుత్వ అధికారులకు మామూళ్ళను కట్టబెడుతూ.ప్రజలపై జులుం ప్రదర్శిస్తూ. ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటు వ్యక్తులు శాసిస్తున్న వైనం...