
వై.ఎస్.ఆర్ కడప జిల్లా జూన్ 22ప్రజావాణి పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 144 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి. PGRS కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదు లను స్వీకరించారు.చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. వాటిపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్.పి నేరుగా మాట్లాడి సమస్యను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) శ్రీ కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్,పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




