📄 ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్టి. నరసాపురం మండలం లో ఆదివాసి గిరిజన కొమరం భీమ్ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్...

టి. నరసాపురం మండలం లో ఆదివాసి గిరిజన కొమరం భీమ్ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న బొరగం శ్రీనివాసులు 

📰 Generate e-Paper Clip

​ఏలూరు జిల్లా జూన్ 9 ప్రజావాణి,టి.నరసాపురం మండలం, ఏపిగుంట పంచాయతీ పరిధిలోని రాముడుగూడెం గ్రామంలో ఆదివాసి గిరిజన కొమరం భీమ్ మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ,సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బొరగం శ్రీనివాసులు,విచ్చేసి,విగ్రహాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ.మన సంస్కృతి – మన అస్తిత్వం-మన సంప్రదాయం-మన గౌరవం జల్-జంగిల్-జమీన్ (నీరు-అడవి – భూమి) హక్కుల కోసం,ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు కొమరం భీమ్ అని,అలాగే దేశానికి దిక్సూచిలాంటి రాజ్యాంగాన్ని అందించి అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు.​అనాది కాలంగా ప్రకృతిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీల ఆచారాలను,విశిష్టమైన కళలను మరియు వారి వీరోచిత చరిత్రను నేటి తరానికి చాటిచెప్పేలా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి,వారి హక్కుల రక్షణకు మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున,వ్యక్తిగతంగానూ ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.నిర్వాహకుల ​ఆదివాసి గిరిజన సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పూసం అంజిబాబు,పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ​ఈ మహాసభలో బొరగం శ్రీనివాసులు,తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శీలం.వెంకటేశ్వరరావు, AMC చైర్మన్ పొట్ట రామారావు,క్లస్టర్ ఇంచార్జ్ జోనుబోయినా సోంబాబు, బచ్చల వెంకటేశ్వరరావు,కల్నేడి రాంబాబు,గ్రామ కమిటీ అధ్యక్షులు సాధనల బిసిబాబు, కల్నిడి వెంకటరత్నం తెలుగుయువత అధ్యక్షులు కల్నిడి వాసు,మండల ప్రధాన కార్యదర్శి వెలిది నాగబాబు,చింతలపూడి నవీన్,రాష్ట్ర డైరెక్టర్స్ కాకి లక్ష్మి, కొవ్వసి.జగదేశ్వరి,ప్రజాప్రతినిధులు,ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు,పెద్ద సంఖ్యలో గిరిజన సోదరులు, మహిళలు మరియు యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular