ఇంధన ధరల పెంపు ఉపసంహరించాలంటూ సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉండాలని రాస్తారోకో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గోపవరం మండలం పి పి కుంట సర్కిల్ వద్ద రాస్తారోకో.
బద్వేల్.జూన్ 9 ప్రజావాణి ప్రజలపై భారాలు మోపొద్దంటూ రాస్తారోకో సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పి.వి రమణ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోమంగళవారం గోపవరం మండలం పి పి కుంట సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పి.వి రమణ మాట్లాడుతూ,గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం 11 రోజుల వ్యవధిలోనే పెట్రోల్,డీజిల్ ధరలను రూ.10కు పైగా పెంచిందని ఆరోపించారు.ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతోందని విమర్శించారు.దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల జీవన వ్యయం అధికమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, దీంతో మధ్యతరగతి, పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.మోదీ ప్రభుత్వం తన 12 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతోందని వామపక్ష నాయకులు ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని కారణంగా చూపుతూ ఇంధన ధరలను పెంచడం సమంజసం కాదని విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మండిపడ్డారు..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగాయని,అనేక ప్రాంతాల్లో ఎరువుల కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సాగు వ్యయం పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎరువుల ధరలను తగ్గించి రైతులకు అందుబాటులో ఉంచాలని, ప్రజలపై మోపుతున్న భారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకో కార్యక్రమంలో సిపిఐ గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, సిపిఐ పార్టీ గోపవరం మండల నాయకులు సిద్ధం వెంకటయ్య ఎం ఓబులేసు గురయ్యా సుబ్బరాయుడు శివ వెంకటేశు పెంచలయ్య రమాదేవి రాజేష్ పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొనడం జరిగింది.




