టి. నరసాపురం మండలం లో ఆదివాసి గిరిజన కొమరం భీమ్ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న బొరగం శ్రీనివాసులు 

​ఏలూరు జిల్లా జూన్ 9 ప్రజావాణి,టి.నరసాపురం మండలం, ఏపిగుంట పంచాయతీ పరిధిలోని రాముడుగూడెం గ్రామంలో ఆదివాసి గిరిజన కొమరం భీమ్ మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ,సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బొరగం శ్రీనివాసులు,విచ్చేసి,విగ్రహాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ.మన సంస్కృతి - మన అస్తిత్వం-మన సంప్రదాయం-మన గౌరవం జల్-జంగిల్-జమీన్...