📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే భూ కబ్జాదారుల నుండి వాంపల్లెచెరువును రక్షించడి.కనుమరుగై పోతున్న వాంపల్లెచెరువు

ఎమ్మెల్యే భూ కబ్జాదారుల నుండి వాంపల్లెచెరువును రక్షించడి.కనుమరుగై పోతున్న వాంపల్లెచెరువు

📰 Generate e-Paper Clip

 బి.మఠం ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)ఎమ్మెల్యే భూ కబ్జాదారుల నుండి వాంపల్లెచెరువును రక్షించడి.కనుమరుగై పోతున్న వాంపల్లెచెరువు ఇలాగైతే చరిత్ర లో చెరువులను మ్యాప్ లో మాత్రమే చూడాలి డెబ్బై ఎకరాల పై బడిన చెరువు ప్రస్తుతం ముప్పై ఎకరాలు మాత్రమే యథేచ్ఛగా చెరువులో అక్రమ బోర్లు విద్యుత్ కనెక్షన్లు మొద్దు నిద్రపోతున్న అధికారులు చెరువులను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు కనుమరుగు చెరువును ఏటీఎం లా వాడుకుంటున్న మైనింగ్ మాఫియా వివరాల్లోకి వెళితే బి.మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ లోని వాంపల్లెచెరువు ప్రస్తుతం భూకబ్జా దారులకు దోచుకున్నోడికి దోచుకున్నంతలా మారింది అక్రమార్కుల చేతిలో రోజు రోజుకు చెరువు అంతరించిపోతుంది.దాదాపు డెబ్బై ఎకరాల పైన విస్తీర్ణంలో ఉన్న వాంపల్లెచెరువు ప్రస్తుతం కనుమరుగైపోయింది కొంతమంది భూకబ్జా దారులు ఏకంగా చెరువునే ఆక్రమించి అక్రమంగా బోర్లు విద్యుత్ కనెక్షన్లు కుడా ఏర్పాటు చేసుకున్నారు ఈ భూమ్మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువులు కుంటలు మనిషికి జీవనాధారం అలాంటిది చెరువులు కుంటలు లేకపోతే భవిష్యత్తులో నీటికి ఎంత కరువు ఉంటుందో అందరికీ తెలిసిందే నీటికోసం ఏకంగా ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి వందల కిలోమీటర్లు నీటిని తీసుకొస్తున్నారు,ప్రకృతిలో కురిసే వర్షాల కారణంగా వాగులు వంకలు పారి చెరువులు నీటితో నిండి కరువును దూరం చేస్తాయి,కానీ ఇప్పుడు అలాంటి చెరువులే భూ భకాసుర చేతుల్లోకి వెళుతుంటే భవిష్యత్తులో మనిషికి వన్యప్రాణులకి జీవనం ప్రశ్నార్థకంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మనిషికి వన్యప్రాణులకి జీవనాడిలా ఉండే చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి పైన ఉంటుంది,చెరువులే కనుమరుగై పోతే పాడి,పంట శూన్యం,నీటీని జల్లెడ పట్టేందుకు కొన్ని వందల అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారు,ఆయినా చుక్కనీరు దొరకని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాం ,ఇదిలా ఉంటే ఈ భూ బకాసురుల స్వార్ధానికి మూగ జీవులు కుడా బలైపోతున్నాయి పొలం చుట్టూ ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తగిలి పశువులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటనలు కుడా చాలానే జరిగాయి,ఇటీవల పశువులను మేపుకుంటూ చెరువులోకి వెళ్ళిన ఓ పశువుల యజమానిని కుడా ఇటు వైపు రావద్దని అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న వీరిపై ఎటువంటి చర్యలు లేవు.ఒక వైపు మైనింగ్ మాఫియా మరోవైపు భూ బకాసురుల చేతిలో చెరువులు అంతరించి పోతున్నాయి.ప్రకృతిలో లభించే వర్షపు నీటిని ఒడిసి పట్టే చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది,మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో అనేక సంస్కరణలు చేపట్టారు భూకబ్జా దారుల పై ఉక్కు పాదం మోపారు,ప్రజలు కుడా ఎమ్మెల్యే పై ప్రశంసలు కురిపించారు,ఇదే క్రమంలో ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్న చెరువులను భూ బకాసురల చేతుల్లోకి వెళ్ళకుండా చెరువులకు హద్దులు మరియు బౌండరీ లైన్లు ఏర్పాటు చేసి అన్యాక్రాంతం అవుతున్న చెరువులను రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular