📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్డా. బిఆర్. అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి..

డా. బిఆర్. అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి..

📰 Generate e-Paper Clip

మైదుకూరు ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)డా.బిఆర్.అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి.భారత దేశ చారిత్రాత్మక మలుపులో అంబేద్కర్ పాత్ర కీలకం.మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల సదస్సులో ఏఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య.భారత దేశ స్వాతంత్రానంతరం రాజ్యాంగన్ని తన మేధో సంపత్తితో రచించి దేశానికి దారి చూపిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య అన్నారు.బుధవారం మైదుకూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సదస్సు నిర్వహించడం జరిగిగింది.ఈ సందర్బంగా ఓబయ్య మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న జన్మించారు.విద్యాలో మంచి ప్రావిన్యం సంపాధించి ఉన్నత చదువులకు లండన్ కు వెళ్లి అక్కడ వివిధ రాజకీయ,సామాజిక, ఆర్ధిక అంశాలపై పరిశోధనలు చేసాడు. భారత దేశానికి వచ్చిన అయన న్యాయవాదిగా వుంటూ,తన ప్రతిభా పాఠవాలతో రాజ్యాంగం రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ దేశాల్లోని అన్ని రకాల రాజ్యాంగాలని కులాంకశాంగా చదివి మన రాజ్యాంగాన్ని రచించడంలో కీలకంగా వున్నారు.దేశంలోని పౌరులందరు ఆర్ధిక,సామాజిక,రాజకీయ ల్లో సమాన హాక్కులు పొందెల, ప్రజలందరూ ఆత్మగౌరవం తో ఉండేందుకు అన్ని రకాల చట్టాలను రూపొందించారు.ఎలాంటి అసమానతలు లేకుండా స్వేచ్ఛ గా బ్రతికేలా ప్రాధమాకా హక్కులు,దేశం ఆర్థికంగా ఎదిగేందుకు సంభందించిన అంశాలను రాజ్యాంగం లో పొందుపరిచారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తో దేశం మొత్తం బలమైన సార్వాభౌమాధికారం దేశాంగా,శక్తివంతమైన దేశాంగా నిలబడడానికి ఉపయోగ పడిందని, అటువంటి మహనీయునిడిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలన్నారు.వచ్చే ఏప్రిల్ 14 న 135 వ జయంతి ఉత్సవాలా సందర్బంగా ఘనన్హా నిర్వహించుకోవాలని ఓబయ్య పిలుపునిచ్చాడు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular