📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను రద్దు చేయండి;;పద్మశ్రీ ' మంద కృష్ణ...

ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను రద్దు చేయండి;;పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ

📰 Generate e-Paper Clip

ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు,ప్రజావాణి న్యూస్(మార్చి30)పద్మశ్రీ ‘మంద కృష్ణ మాదిగ  ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు,కుల వ్యవస్థను రద్దు చేయండి.ఎస్సీల మత స్వేచ్ఛను హరించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం మరియు వివక్షతకు ప్రతిరూపం.కుల వివక్షతను రూపుమాపడం చేతకానప్పుడు కుల వ్యవస్థను రద్దు చేయండి.ఓసి,బిసి క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకు,క్రైస్తవాన్ని ప్రచారం చేసే మత ప్రచారకులంతా అగ్రకులాలే.సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 25 కు పూర్తి విరుద్ధం.హిందూ దేవాలయాలలోకి రావద్దు,ఇంకో మతంలోకి వెళ్ళద్దు అని దళితులకు ఆంక్షలు పెట్టడం దుర్మార్గం.ఏమి తినాలో,ఎలా ఉండాలో,ఎక్కడికి వెళ్ళాలో,ఏ విశ్వాసాలు పాటించాలో మీరే నిర్ణయిస్తారా,దళితులు గొర్రెలు అనుకుంటున్నారా,ఇకపై చెల్లవు. గాంధీ మరియు గాంధీ అనుచరుల కుట్రల వల్ల దళిత క్రైస్తవులు హక్కులు కోల్పోయారు.గాంధీ కుట్రల వల్ల దళితులు కమ్యునల్ అవార్డును మరియు మత స్వేచ్ఛ హక్కులను కోల్పోయారు. రాజ్యాంగ సమయంలో క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించింది అగ్రకులాలే.అందువల్లనే దళిత క్రైస్తవుల హక్కులపై వాళ్ళు మాట్లాడ లేదు.క్రైస్తవంలోకి వెళితే బ్రాహ్మణుల,రెడ్డిల,కమ్మల,వెలమ కులస్తుల సామాజిక హోదా మారనప్పుడు దళితుల ఎస్సీ హోదా ఎందుకు మారుతుంది. క్రైస్తవంలోకి మారిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు క్రైస్తవంలోకి మారిన దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు పొందకూడదు, క్రైస్తవంలోకి వెళ్ళినంత మాత్రాన దళితుల సామాజిక స్థితిగతులు మారవని డా అంబేద్కర్ 1937లోనే స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులు ఆత్మగౌరవానికి,సామాజిక హక్కులకు దూరం అయ్యారని అంబేద్కర్ ఆవేదన చెందాడు.కుల వ్యవస్థ అన్ని మతాలను ప్రభావితం చేస్తుంది.కుల వ్యవస్థ వల్ల దళితులు పశువుల కన్నా హీనంగా చూడబడ్డారు.కుల వ్యవస్థ వల్లనే హిందూ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించలేకపోయింది.క్రైస్తవం,ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుంటే హిందూ మతం ఎందుకు ప్రభావం చుపెట్టలేకపోతుందో ఆలోచించి లోపాలు సరి చేసుకోవాలి.అఖండ భారత్ నుండి ప్రస్తుత భారత్ మిగిలింది,కుల వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రస్తుత భారత్ కూడా మిగలదేమో అని ఆందోళనగా ఉంది. అందుకే కుల వ్యవస్థను రద్దు చేయాలి.హిందూ దేవాలయాలు అందరివి అయినప్పుడు బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఎందుకు ఉండాలి.హిందూ దేవాలయాలలో పూజలు బ్రాహ్మణులు మాత్రమే చేయాలని రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వర స్వామి చెప్పారా,అయోధ్య మొదలుకొని అన్ని దేవాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పూజారులుగా నియమించాలి,రాముడికి,శ్రీ కృష్ణుడికి తోడుగా యుద్ధంలో నిలిచింది దళితులు, గిరిజనులు మరియు బీసీలే కానీ బ్రాహ్మణులు కాదు.అందువల్ల ఎస్సీ,ఎస్టీ ,బీసీలె దేవాలయాల్లో పూజారులుగా ఉండాలి. 1956 లో సిక్కు దళిత క్రైస్తవులకు,1990 లో బౌద్ధ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించినట్లుగానే దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి.దళిత క్రైస్తవులు అంబేద్కర్,నెల్సన్ మండేలా,మార్టిన్ లూతర్ కింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేయాలి.ప్రార్థనలు మాత్రమే కాదు పోరాటం కూడా దళిత క్రైస్తవులు చేయాలి.దళిత క్రైస్తవులు పోరాటం చేస్తే MRPS వారికి అండగా ఉంటుంది .సామాజిక ఉద్యమ నమస్కారాలతో.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular