📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగరంగ వైభవంగా గుగ్గిళ్ళలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

అంగరంగ వైభవంగా గుగ్గిళ్ళలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

📰 Generate e-Paper Clip

అంగరంగ వైభవంగా గుగ్గిళ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

బెజ్జంకి, మార్చి 27 (ప్రజావాణి)

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు.ఈ మహోత్సవానికి ఎంపీడీవో శ్రీనివాస్ రూ.10,000లు విరాళంగా అందజేశారు. అలాగే గ్రీన్ వెస్ బయో ఎనర్జీ యాజమాన్యం రాజీవ్ చేట, రామ్ రెడ్డి రూ.10,000లు అందించారు. అన్నదాన కార్యక్రమం  కోసం  గ్రామపంచాయతీ పాలకవర్గం,వార్డు సభ్యులు, కూరగాయలు, గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమానికి తమకు తోచిన సహాయం అందజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ శ్రీ రామనవమి వేడుకలకు హాజరై తమకు తోచిన సహాయం అందజేసిన ప్రతి పేరు పేరునా ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య,ఉపసర్పంచ్ దుగ్యానీ లావణ్య, వార్డు సభ్యులు కొంకటి సంపత్, పంతంగి వెంకటేష్,దుశెట్టి రాజిరెడ్డి, పోతూ భూలక్ష్మి, కొంకటి కుమార్,కొంకటి సురేష్,గుగ్గిళ్ల లావణ్య, సీత రేణుక గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular