📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetపాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్ 

పాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్ 

📰 Generate e-Paper Clip

పాములపర్తి పాఠశాలలో విద్యార్థుల మాక్ పార్లమెంట్

సిద్దిపేట్ మర్కుక్, మార్చి 26, ప్రజావాణి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తిలో బుధవారం విద్యార్థులతో మాక్ పార్లమెంటును నిర్వహించారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు ,పార్లమెంటరీ విధానాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో స్పీకర్ గా కావ్య శ్రీ ,ప్రధానమంత్రిగా శ్వేత,విద్యాశాఖ మంత్రిగా అర్చన ,ఆర్థిక మంత్రిగా వైష్ణవి ,ప్రతిపక్ష నేతగా మనోహర్ పాత్రలు పోషించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకి అధికారపక్షం నేతలు దాటిగా సమాధానాలు ఇవ్వడంతో సభలో ఉత్సాభరిత వాతావరణంనెలకొంది.పలు సమకాలీన సమస్యలపై వాడివేడిగా చర్చలు జరగడం అందరిని ఆకట్టుకుంది .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ లతీ సైదా ,సీనియర్ ఉపాధ్యాయులు నరోత్తం రెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు సంతోష తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.