📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్అంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు  వై. చిన్న బ్రహ్మయ్య

అంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు  వై. చిన్న బ్రహ్మయ్య

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ మహాకాల సదస్సుకు ఎంపికైన దామరకుంట ఉపాధ్యాయులు  వై చిన్న బ్రహ్మయ్య

సిద్దిపేట జిల్లా మర్కూక్, మార్చి 26, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు గా సేవలందిస్తున్న వై చిన్న బ్రహ్మయ్య, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు .భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో మహాకాల ది మాస్టర్ ఆఫ్ టైం అనే అతి ప్రాధాన్య భరిత అంశంపై 2026 ఏప్రిల్ 3 నుండి 5 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆయన ఎంపిక కావడం విశేష  నిలిచింది ఈ సదస్సులో దేశ విదేశాల నుండి విశిష్ట విద్యావేత్తలు శాస్త్రవేత్తలు పాల్గొనడం నేపథ్యంలో బ్రహ్మయ్య  ఎంపిక విద్యారంగంలో ఆయన కృషి నిబద్ధత వారి ఎంపికకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఘనత జడ్పీహెచ్ఎస్ దామరకుంట పాఠశాలకు మాత్రమే కాకుండా మార్కుక్మం డలం మరియు సిద్దిపేట జిల్లా కు సైతం గర్వకారణంగా నిలిచింది విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడంలో ఆయన చూపుతున్న అంకితభావం ,నూతన ఆవిష్కరణ పట్ల ఆసక్తి బోధనలో ప్రతిభ ఆయనను ఈ స్థాయికి చేర్చాయి ,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మండల విద్యాధికారి అయిన శ్రీ వెంకట రాములు , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పి బాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు అమ్మ ఆదర్శ కమిటీ బ్రహ్మయ్య గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.