📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*

కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*

📰 Generate e-Paper Clip

*కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*

 

 

ఎంఆర్‌పిఎస్ డిమాండ్.

 

 

చెన్నారావుపేట మార్చి 22 (ప్రజావాణి)

 

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఆర్‌పిఎస్ తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం చెన్నారావుపేట మండలంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు…మండల అధ్యక్షురాలు పైస రజిత ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆకులపెల్లి ఉప్పలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం మాట తప్పకుండా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు సభ్యుడు ఇసాంపెల్లి అయిలయ్య, నాయకులు బొమ్మకంటి పోషాలు, సాధు రాజు, కేశపాక యాకూబ్, పాంధిల్లా రాజేందర్, పైస రాజు, పైస రాములు, పైస లక్ష్మణ్, మట్టేవాడ ప్రశాంత్, జంగిలి సమ్మక్క, చాతల్ల వసంత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.