📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణHyderabadఘనంగా నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

ధర్మారం చౌరస్తాలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 22(ప్రజావాణి):

నందమూరి, నారా వంశాల ముద్దుల మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలను జగిత్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించాయి. సోమవారం దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు సముద్రాల రమేష్ గుప్తా ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తా వద్ద సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా రమేష్ గుప్తా మాట్లాడుతూ.. నారా దేవాన్ష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి, బాటసారులకు, స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సతీష్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, దూడ శ్రీధర్, ఎస్. సతీష్ రెడ్డి, బి. అశోక్, టి. సతీష్, సాగర్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular