కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*
*కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* ఎంఆర్‌పిఎస్ డిమాండ్. చెన్నారావుపేట మార్చి 22 (ప్రజావాణి) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఆర్‌పిఎస్ తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం చెన్నారావుపేట మండలంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల...