- ఉగాది పండుగ శుభసందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లతకుంట మండలంలోని పొత్తూరు గ్రామ ప్రజలకు శుభవార్తగా కొత్త బస్ సర్వీసు ప్రారంభమైంది.

పొత్తూరు బస్ స్టాండ్ నుండి ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు బస్ బయలుదేరి సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్‌కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంగా జేబీఎస్ నుండి సాయంత్రం 4:30 గంటలకు బస్ బయలుదేరి తిరిగి పొత్తూరుకు చేరుతుంది. ఈ సర్వీసు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఎంతో లాభపడనున్నారు.
ఈ బస్ సర్వీసు ప్రారంభానికి మానకొండూరు శాసనసభ్యులు కోంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారం అందింది.
ఈ సందర్భంగా పొత్తూరు గ్రామ సర్పంచ్ పత్న అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిందని, ఈ బస్ సర్వీసు అందుబాటులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సదుపాయం కల్పించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, మెదక్ డిపో రీజనల్ మేనేజర్ విజయ్ గారు, సిద్ధిపేట డిపో మేనేజర్ గారికి పొత్తూరు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కొత్త బస్ సర్వీసుతో ఎల్లతకుంట మండలం పొత్తూరు గ్రామ ప్రజల ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.





