పరిమితి మించి వైద్యం ఆర్ఎంపీలదే ఇష్టారాజ్యం.ఆర్.ఎం.పి.వైద్యుల అరాచకాలతో దోపిడీకి గురి అవుతున్న పట్టణ గ్రామీణ ప్రాంత వాసులు సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్న ప్రజానికం.వివరాల్లోకి వెళితే ఎంబిబిఎస్ డాక్టర్ దగ్గరికి వెళితే వ్యాధి నిదానంగా తగ్గుతుందని అదే ఆర్.ఎం.పి వైద్యుడి దగ్గరికి వెళితే వ్యాధి కొన్ని గంటల్లో తగ్గుతుందని కారణం.ఎంబిబిఎస్ కష్టపడి చదివి వ్యాధికి సంబంధించి నటువంటి వైద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో వాడి రోగికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంబిబిఎస్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.అదే RMP.వైద్యుడు కేవలం పదో తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి చేయకుండానే ఒక సంవత్సరం పాటు ప్రైవేటు ఆసుపత్రిలో నేర్చుకుని సొంతగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్.ఎం.పి.వైద్యుడిగా కొనసాగుతూ అవగాహన లేని వైద్యం అందిస్తూ వ్యాధికి సంబంధించినటువంటి మందుని అధిక మోతాదులో ఇవ్వడం ద్వారా కిడ్నీ,లివర్,ఊపిరితిత్తులు మొదలగు సైడ్ ఎఫెక్ట్స్ గ్రామీణులకు సోకుతున్నయని పలువురు సీనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు.వైద్యం వికటించి రోగాల బారిన పడుతున్న నిరుపేదలు.RMP.వైద్యుల అరాచకాలతో దోపిడీకి గురి అవుతున్న పట్టణ గ్రామీణ ప్రాంత వాసులు సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్న ప్రజానికం,MBBS.డాక్టర్ దగ్గరికి వెళితే వ్యాధి నిదానంగా తగ్గుతుందని అదే ఆర్. ఎం.పి వైద్యుడి దగ్గరికి వెళితే వ్యాధి కొన్ని గంటల్లో తగ్గుతుందని కారణం ఎంబిబిఎస్ కష్టపడి చదివి వ్యాధికి సంబంధించినటువంటి వైద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో వాడి రోగికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంబిబిఎస్ డాక్టర్లు వైద్యం అందిస్తారని.అవగాహన లేని వైద్యం అందిస్తూ వ్యాధికి సంబంధించినటువంటి మందుని అధిక మోతాదులో ఇవ్వడం ద్వారా కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు మొదలగు సైడ్ ఎఫెక్ట్స్ గ్రామీణులకు సోకుతున్నయని పలువురు సీనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు.సంవత్సరాలు తరబడి వైద్యరంగంలో ఉన్నత చదువులను చదివి పట్టభద్రులై వైద్యం చేస్తుంటే వ్యాధికి సక్రమమైన వైద్యాలు అందించడం జరుగుతున్న పెద్ద చదువులు చదివిన వైద్యులే వైద్యం అందించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, కాని వైద్యంపై అరా కోరా తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ధనమే ధ్యేయంగా సంపాదనే లక్ష్యంగా పెట్టుకుని హద్దు అదుపు లేకుండా RMP.గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వైద్యం పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్న కూడా.సంబంధిత జిల్లా వైద్య అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని..అదే రీతిలో మెడికల్ షాపులు ధరలకు మించి అమ్ముతున్న సంబంధిత అధికారులు ఎక్కడున్నారో తెలియదని, ఏదో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నట్లు పోయిన్నట్లు ఉందని, జరుగుచున్న అక్రమాలపై ఎటువంటి ఉన్నతా ధికారుల నిఘా లేకపోవడంతో ఆర్.ఎం.పి. వైద్యుల ఆగడాలు, మెడికల్ షాపుల అధిక ధరల అక్రమాలకు అడ్డు లేకుండా పోతున్నదని. జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.ఇప్పటికైనా వారు చేస్తున్న మితిమీరిన వైద్యానికి అడ్డుకట్ట వెయ్యకపోతే ఎంతోమంది ప్రాణాలు బలిగొరుతున్నారని .వైద్యం వికటించి చనిపోతే మాకు సంబంధమే లేదని తప్పుకుం టున్నారని, చనిపోయిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేసిన RMPలు కొందరు దళారీలను వెంట బెట్టుకుని బాధితులపై దౌర్జన్యానికి పూనుకుని చేతులు దులుపుకుంటున్నారని, వీరు వైద్యం చేసిన తర్వాత ఎంత అడిగితే అంత ఇవ్వక తప్పదని గ్రామీణులు ఆరోపిస్తున్నారు.పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక వైద్యశాలలతో పాటు MLHP.లు,ANM.లు,ఆశా వర్కర్లు చేసే అరా చకాలను ఉన్నత అధికారులు దృష్టికి తీసుకు వెళితే గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం ప్రతి ఒక్కరికి అందుతుందని అలాంటి చర్యలకు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వైద్య అధికారి,సబ్ డివిజన్ వైద్యాధికారి, గ్రామానికి సంబంధించిన వైద్యా ధికారులు కూడా ఆర్.ఎం.పి.లు చేసే నకిలీ వైద్యంపై దృష్టి పెడితే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో.అడ్డుకట్ట వేయవచ్చునని, పేద ప్రజలకు ప్రభుత్వమే మెరుగైన సేవలు అందిస్తున్న వాటిని తప్పుదారి పట్టిస్తుంది.ధన వ్యామోహం కోసం ప్రభుత్వ వైద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆరో పిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్.ఎం.పి.వైద్యులు చేసే అరాచకాలను అరికట్టాలని పట్టణ గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు.
ఆర్.ఎం.పి.. వైద్యుల అరాచకాలు వైద్యం వికటించి రోగాల బారిన పడుతున్న నిరుపేదలు
0
11
RELATED ARTICLES
- Advertisment -




