📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialశానబండలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు

శానబండలో పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు

📰 Generate e-Paper Clip

పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు

పశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్న సర్పంచ్ భాస్కర్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 16 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని శానబండ గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా గ్రామంలోని 43 ఆవులు, ఎడ్లకు అలాగే 26 గేదెలకు పశువైద్య సిబ్బంది టీకాలను వేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గాదం భాస్కర్ మాట్లాడుతూ…. పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల నివారణకు రైతులు ముందస్తుగా టీకాలు వేయించాలని కోరారు. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి రజిత, గ్రామ కార్యదర్శి మారుతి, వార్డు సభ్యులు గాదం శ్రావణ్ కుమార్, శంకరయ్య, రవి, మల్లేష్, చంద్రయ్య పాల్గొన్నారు. పశువైద్య బృందంలో డాక్టర్ పి. శ్రీప్రియ, రాజేందర్, నవీన్, లక్ష్మి, కుమార్ తదితర సిబ్బంది పశువులకు టీకాలు వేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular