📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamసంక్షేమ "హాస్టళ్లకు" చుక్కలు చూపిస్తున్న మధిర హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ…?

సంక్షేమ “హాస్టళ్లకు” చుక్కలు చూపిస్తున్న మధిర హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ…?

📰 Generate e-Paper Clip

*అన్ని తానై వ్యవహరిస్తున్న ఆ మేనేజర్

సంక్షేమ “హాస్టళ్లకు” చుక్కలు చూపిస్తున్న మధిర హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ…?

*అన్ని తానై వ్యవహరిస్తున్న ఆ మేనేజర్..!

ఓ సంస్థ (ముసుగులో)అండతో… సంక్షేమ హాస్టల్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న వైనం..?


వివరాలు కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి “రాని నిర్వాహకురాలు”…?


సంక్షేమ హాస్టల్ లో గ్యాస్ కొరతపై “మూడుసార్లు” లేఖలు సమర్పించిన ఇవ్వని వైనం


సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ అంటూ కిరికిరి

హాస్టల్ సిబ్బంది ఇంట్లో గ్యాస్ తో విద్యార్థుల కు భోజనం

జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలు పట్టించుకోని ఏజెన్సీ నిర్వాహకులు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరు వలన వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టల్స్ కు చుక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మధిర నియోజకవర్గంలోని బోనకల్ మధిర ఎర్రుపాలెం మండలాలకు చెందిన వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసి గృహ వినియోగదారులు హాస్పిటల్స్ సంక్షేమ హాస్టల్స్ ఇతర ప్రధానమైన విభాగాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కృత్రిమ కొరత లేకుండా ఆదేశాలు ఇచ్చినప్పటికీ సాక్షాత్తు బోనకల్లు మండలానికి చెందిన ఓ సంక్షేమ హాస్టల్ వార్డెన్ మూడు దఫాలుగా గ్యాస్ కోసం లేఖలు అందజేసినప్పటికీ డిడి అని ఎస్సీ వెల్ఫేర్ అని బీసీ వెల్ఫేర్ అని మధిర ఏజెన్సీ చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తున్నట్లు తెలిసింది. పైగా మూడు దఫాలుగా గ్యాస్ నిర్వాహకులను సంప్రదించినప్పటికీ మూడు రోజులు గడిచిన గ్యాస్ అందించకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై గ్యాస్ నిర్వాహకురాలను మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వివరాలు కోరేందుకు ప్రయత్నించగా మీటింగ్లో ఉన్నామంటూ మెసేజ్ చేసి ఓ ప్రైవేటు వ్యక్తి ద్వారా ప్రతినిధితో మాట్లాడించారు. రంగంలోకి దిగిన సదరు వ్యక్తి మేనేజర్ గా చలామణి అవుతున్నట్లు మేడాన్ని సంప్రదించారు విషయం ఏంటి అంటూ పలుమార్లు చరవాణిలో ప్రశ్నించారు. కాగా స్పందించిన ప్రతినిధి గ్యాస్ సరఫరా లో కిరికిరి సృష్టిస్తున్నారని సంక్షేమ హాస్టల్స్ కు గ్యాస్ తరపున కోసం లేఖలు సిఫారసులు పట్టించుకోవడంలేదనే విషయాలపై ఆధారాలు ఉన్నాయా అంటూ ఆరా తీసిన సదరు వ్యక్తి మేనేజర్గా చలామణి అవుతున్నట్లు ఓ సంస్థ లో పనిచేస్తూ గ్యాస్ ఏజెన్సీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తూ అన్నితానై వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందింది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా లో అవాంతరాలు లేకుండా వినియోగదారులకు సంక్షేమ హాస్టల్స్ హాస్పిటల్స్ కు ప్రభుత్వ నిబంధనలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

మధిర గ్యాస్ ఏజెన్సీ వ్యవహారంలో అధికారుల వివరణలు మరికొన్ని అంశాలతో.. రేపటి కథనం..2లో వేచి చూడండి….!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.