📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై మార్చి 17,18 డివైఎఫ్ఐ జన చైతన్య జీపు...

డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై మార్చి 17,18 డివైఎఫ్ఐ జన చైతన్య జీపు జాత

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)బద్వేల్ డ్రగ్స్ గంజాయి నీ వ్యతిరేకిస్తూ యువతను చైతన్యపరిచే విధంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్చి 17,18 న రెండు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జన చైతన్య జీపు జాత నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఎస్కేఆదిల్ తెలిపారు ఆదివారం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య జీవజాత కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ మరియు గంజాయి వీటి బారిన పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అటు తల్లిదండ్రులకు,ఇటు సమాజానికి పనికి రాకుండా పోతున్నారని అన్నారు.వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి మాఫియాను నిర్మూలించాలన్నారు.విద్యా సంస్థల వద్ద ట్రాస్క్. ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలపై పాఠ్యపుస్తకాలలో ప్రత్యేక పాఠ్యాంశాన్ని చేర్చాలన్నారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక మత్తు పదార్థాల విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.బద్వేల్ లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని తద్వారా క్రీడలకు ప్రోత్సహించాలని అన్నారు. ప్రధానంగా యువత చెడు మార్గాల వైపు ఉపాధి లేకనే ఎక్కువ ముగ్గు చూపే అవకాశం ఉందని కావున ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉపాధి కల్పించాలని కోరారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జనచైతన్య జీపు జాత ద్వారా యువతను చైతన్య పరుస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వెళ్తామన్నారు 17,న బద్వేల్ లో జీపు జాత ప్రారంభమై మైదుకూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు మండలం కమలాపురం నియోజకవర్గాల మీదగా వెళ్తూ 18,వ తేదీ సాయంత్రం జాత కడపలో ముగుస్తుంది అన్నారు ఈ జాతను యువత ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి,సుధాకర్ సహాయ కార్యదర్శి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular