కౌంటర్ మొదలైతే… రీకౌంటర్ చరిత్ర అవుతుంది
సవాల్ చేస్తే సమాధానం తప్పదు
మన సమగ్ర ప్రజావాణి జూన్ 28
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అభివృద్ధి పనులను బిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఖండిస్తు బి ఆర్ ఎస్ నాయకులు సమాధానం ఇచ్చారు.
ఈ సమావేశం లో మున్సిపల్ కౌన్సిలర్ నాగ రత్నం గౌడ్ తాలుక లక్ష్మణ్
చాపల వెంకటేశం మాట్లాడుతూ మా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఎన్నడూ అడ్డుకోలేదు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న భారీ వాహనాలను జెసిబి లను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ వారికీ అభివృద్ధి అడ్డుకున్నట్టు కనపడుతుంది.కాంగ్రెస్ నేతలు
మీ ఇష్టం వచ్చినట్టు ఖబర్దార్ అని బెదిరింపు మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు భయపడరు మీ ప్రభుత్వం అభివృద్ధి పనులు పూర్తి చేసే వరకు ప్రశ్నిస్తూనే వుంటాం గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు కాంగ్రెస్ నాయకుల వ్యవహారం వుంది. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలు అడ్డుకుంటే వీళ్ళు మమ్మల్ని అభివృద్ధి పనులు అడ్డుకుంటూన్నాం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు మేము ప్రభుత్వానికి మరియు మీ కాంగ్రెస్ నేతలకు సంబందించిన వారి పనుల దగ్గరికీ మీరు చేపట్టే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలకు ఎన్నడూ అడ్డుపడలేదు అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి సరఫరాను అడ్డుకుంటే కాంట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై మా బి ఆర్ ఎస్ పార్టీ మీద బురుద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలు మరియు రవాణా చేస్తున్న వాహనాలు రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారులకు అప్పగించడం జరిగింది. కస్టడీలో ఉన్న వాహనాలను రాత్రికి రాత్రి విదిపించడం విడ్డూరంగా ఉందన్నారు రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారుల మీద కూడ అనుమానం వస్తుంది. అక్రమదారులకు వంత ఆడుతున్నట్లు వుంది ప్రభుత్వానికి సంబంధించిన ఏ అభివృద్ధి పనికి అయిన ప్రతి ఒక్క మెటీరియల్ సంబంధించి ప్రభుత్వం ద్వార కాంట్రాక్టరుకు డబ్బులు లభిస్తాయి అనేది యదార్థం అభివృద్ధి పనుల కోసం కావాలసిన మట్టి కొరకు సంబంధిత మైనింగ్ శాఖ ద్వార గానీ రెవెన్యూ శాఖ ద్వారా గాని అనుమతులు తీసుకొని దానికి సంబంధిన డబ్బును ప్రభుత్వానికి చెల్లించాలి కానీ అలా కాకుండా కాంట్రాక్టర్లు కాంగ్రెస్ నాయకుల తో కుమ్మక్కై అక్రమ మట్టి రవాణా చేస్తున్నట్లు కనిపిస్తుంది ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్టు వుంది అక్రమ మట్టి రవాణా దారులను కాంగ్రెస్ నేతలు అడ్డుకొనకుండ అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న బి ఆర్ ఎస్ పార్టీ వారిపై నిందలు వేయడం ఎంత వరకు సబబు మీ కాంగ్రెస్ నాయకులూ అనుకున్నట్లు ఎక్కడ అక్రమ మట్టి రవాణా జరగకుంటే అందొల్ లో కొన్ని ప్రాంతాల్లో డంపు చేసిన మొరం కుప్పలు ఎవరివి వాటిపైన సంబంధిత అధికారులు విచారణ జరిపి అక్రమ మట్టి నిల్వలు స్వాధీనం చేసుకోవాలి అని డిమాండ్ చేస్తూన్నాం మా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని అడ్డుకొం మీరు చేసే అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ హామలు చేసే వరకు ప్రశ్నిస్తూనే వుంటాం అనీ అన్నారు ఈ సమావేశం లో బి ఆర్ ఎస్ నాయకులు పేండా గోపాల్, పల్లే వెంకట రమణ, రఫిక్, ఇమ్రాన్ ఖాన్, దాసరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు




