📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetకోహెడ మండల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమం..-ముఖ్య అతిథి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం...

కోహెడ మండల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమం..-ముఖ్య అతిథి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..-జిల్లా కలెక్టర్ కే. హైమవతి

📰 Generate e-Paper Clip

కోహెడ మండల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమం..-ముఖ్య అతిథి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..-జిల్లా కలెక్టర్ కే. హైమవతి

సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి

కోహెడ రైతువేదికలో జిల్లా కలెక్టర్ కే. హైమవతి అధ్యక్షతన జరిగిన కోహెడ మండల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య అతిధిగావిచ్చేసికోహెడమండలస్థాయిఅధికారులు,గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహన పై మార్గ నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మండల స్థాయిలో వికేంద్రీకరిస్తూ, గ్రామస్థాయిలో కేంద్రీకరిస్తూ రూపొందించడం జరిగిందని అన్నారు. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శిలు, మండల స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విజయవంతం చేయాలనీ అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ,, జిల్లా మరియు రాష్ట్రస్థాయిలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పరిసరాల పరిశుభ్రత పైళ్ళ క్లియరెన్స్, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, సురక్షితంగా చేరుకోండి, సంక్షేమ కార్యక్రమాలు, పిల్లల భద్రత, డ్రగ్స్ కు నో, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, విద్యాసంబంధ కార్యక్రమాలు, యువత, క్రీడలు, మహిళల అభివృద్ధి, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ ఈ ప్రత్యేక పది అంశాలతో పాటుగా 99 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని అన్నారు. అధికాలు నూతనంగా ఎంపికైన గ్రామ పంచాయతీ పాలకవర్గంతో సమన్వయము చేసుకుంటూ భాద్యతగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా విధులు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు త్రాగునీరు అందించాల్సిన భాద్యత ప్రభుత్వానిది. వేసవికాలంలో గ్రామాల్లో త్రాగునీరు సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సర్పంచులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని త్రాగునీటి వనరులను పరిశీలించి అవసరమైన ముందస్తు ఏర్పాట్లను చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ద్వారా మంజూరై వివిధ నిర్మాణ స్థాయిలలో ఉన్నా ఇండ్ల నిర్మాణంపైప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని త్వరగా నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గృహాల నిర్మాణం పూర్టైతే మళ్ళీ కొత్తగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు నెంబర్ ఇచ్చి విధ్యుత్ సరఫరా అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7మండలాల ప్రజలకు వైద్య సేవల కోసం ప్రభుత్వంచే ప్రత్యేక జీవోతీసుకువచ్చానని ప్రైవేటు సురభి, ఆర్విఎం మెడికల్ కళాశాలలు, సిద్దిపేట ప్రభుత్వం మెడికల్ కళాశాల తదితర 7 వైద్య కళాశాలాలచే ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీల ద్వారా గ్రామాల వళ్ళు గా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన ఆయా మెడికల్ కళాశాలకు తీసుకువెళ్లి వైద్య సేవలు అందించాలని అన్నారు. కోహెడ మండలంలో ఆర్విఎం ప్రైవేట్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న వారందరూ మంచిగా చదువుకోవడం వలననే ఆ స్థాయికి ఎదిగారని, గ్రామాలలో బడిఈడూ పిల్లలెవరు బడి బయట ఉండకుండా ప్రభుత్వ బడులలో చేర్పించాలని, సర్పంచులు, వార్డు సభ్యులు, విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచాలని అన్నారు. అత్యధిక విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరిగే ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను పెంపోందిస్తామని తెలిపారు. విద్యార్థులను చేర్పించి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక సూపిస్తానన్నారు. విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులనుప్రోత్సహించాలని, క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల బారిన యువత పడకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. సాయిల్ టెస్ట్ చేయించుకొని పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులను సాధించవచ్చు అని వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలు ముఖ్యంగా ఆయిల్ ఫామ్ పంటలలో రైతులను ప్రోత్సహించాలన్నారు. పాడి పరిశ్రమ ద్వారా రైతులు లబ్ధిపొందెలా చూడాలని అన్నారు.మహిళలఅభివృద్ధికి ఆర్టీసీ ఉచిత ప్రయాణం, బ్యాంకు లింకేజీ రుణాలు, ఇందిరా మహిళా శక్తి తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అవి మహిళలకు సమర్థవంతంగా అందేలా చూడాలని అన్నారు. పాత ఇజిఎస్ పేమెంట్స్ వెంటనే అందించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణఅతిముఖ్యమైనదని, ప్రజల ఆరోగ్యాన్నిహరించే ప్లాస్టిక్ బదులుగా 13 ఐటమ్స్ తో కూడిన స్టీల్ బ్యాంకులను అన్ని స్వయం సహాయ సంఘాలకు అందించడం జరిగిందని వాటిని కచ్చితంగా ఉపయోగించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యవేక్షించాలని, ప్లాస్టిక్ నిషేదాం పై తీర్మానం చేసుకొని ప్లాస్టిక్ ను ఉపయోగిస్తే ఫైన్ వెయ్యాలని అన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా దోహదం చేస్తుందని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లకు ఇది చక్కని అవకాశమని, ఈ అంశం పై ఈ నెల 12 వ తేదీనా సిద్దిపేట జిల్లా కేంద్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడంజరుగుతుందని ఆ కార్యక్రమానికి హాజరై అవగాహన పెంచుకోవాలని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలమేరకుసమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకుంటే గృహప్రవేశాలకు వస్తానన్నారు.ఈ సందర్భంగా జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular