📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పది సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పది సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 08)చందర్లపాడు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పది,కుటుంబాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలదని సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళల దినోత్సవం పురస్కరించుకొని చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలోని సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో పంచాయతీ లో పనిచేసే మహిళ పారిశుద్ధ్య కార్మికులు ఉలవలపూడి సరస్వతి,నగిరికంటి వెంకమ్మ లకు శాలువాలు కప్పి ఆదివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మహిళలు తమ వంటింటి నుంచి ఏకంగా అంతరిక్షానికి ఎదగడమే దానికి నిదర్శనమని కొనియాడారు.ప్రతి మహిళ గౌరవంగా,ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరారు.అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మార్కపూడి వర కుమార్,జడ్పీహై స్కూల్ చైర్మన్ మార్కపూడి జాన్ కోటయ్య,వార్డ్ మెంబర్ మాధవ,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.