📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నియోజకవర్గ ఇంచార్జి గా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి నియామకం

ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నియోజకవర్గ ఇంచార్జి గా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి నియామకం

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి08) ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నియోజకవర్గ ఇంచార్జి గా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి నియామకం స్థానిక రైల్వే రోడ్ లోని జర్నలిస్ట్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో జరిగిన పత్రిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన కావలి నియోజకవర్గ ఇంచార్జిగా యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతికి నియామక పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మర్లకు ఎ సమస్య వచ్చిన కుమ్మర యువసేన అండగా ఉంటుందని, అలాగే కుమ్మర యువసేన కావలి నియోజకవర్గ ఇంచార్జిగా బెజవాడ అభిసాగర్ ప్రజాపతి కావలి నియోజకవర్గంలో నున్న కుమ్మర్లకు అండగా నిలబడి, కుమ్మర యువసేన నియమావళికి కట్టుబడి పని చేయాలని ఆకాంక్షించారు. యువ న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతికి, జిల్లా అధ్యక్షులు సౌందర్య రాజా ప్రజాపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మర యువసేన ముఖ్య నాయకులు రఘురామయ్యా ప్రజాపతి,.మురళీకృష్ణ ప్రజాపతి,.మస్తానయ్య ప్రజాపతి,. రుషికేశ్ ప్రజాపతి,కావలి మండల అధ్యక్షులు .రవి ప్రజాపతి, రఘుపతి ప్రజాపతి, దిలీప్ ప్రజాపతి, శ్రీనివాసులు ప్రజాపతి,.శ్రీనివాసులు ప్రజాపతి, సుమంత్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.