📄 ePaper
5pm
7pm
Monday, November 30, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనిజ సమాజ సేవకుడు SK షాజహాన్ : ఎంపీడీవో తన సంపాదనలో కొంతమేర పేద విద్యార్థులకు...

నిజ సమాజ సేవకుడు SK షాజహాన్ : ఎంపీడీవో తన సంపాదనలో కొంతమేర పేద విద్యార్థులకు దానం చేస్తున్న దార్శనికుడు . ఎస్కేస్ చారిటీ ట్రస్ట్ సభలో వక్తలు

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం, ప్రజావాణి నవంబర్ 28 : ప్రస్తుతం స్వార్థ జీవితాల కు అలవాటు పడిన మానవ సమాజంలో, నిస్వార్థ జీవితానికి గత 19 సంవత్సరాలుగా అలవాటు పడి సేవలందిస్తున్న నిస్వార్ధ ప్రజా సేవకుడు ఎస్ కె ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఎస్.కె షాజహాన్ అంటూ పలువురు వక్తలు కొనియాడారు. చర్ల మండలంలోని రైతు వేదిక వద్ద శనివారం జరిగిన ఎంబీబీఎస్ విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో ఈ సంవత్సరం 11 మంది ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున తన వంతు సహాయంగా అందించేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న చర్ల మండల ఎంపీడీవో కే ఈదయ్య, మాట్లాడుతూ తాను సంపాదించుకున్న దాంట్లోనే కొంతమేర పేదలకు పంచివ్వాలి అనే కృతనిశ్చయంతో జీవితం కొనసాగిస్తున్న ఎస్కే షాజహాన్ నిజ ప్రజా సేవకుడు అంటూ కొనియాడారు. మరో ముఖ్య అతిధి రౌతు నరసింహారావు మాట్లాడుతూ ఆరు పదుల వయసులో కూడా స్వతంత్రంగా సంపాదిస్తూ తాను సంపాదిస్తున్న దాంట్లో కొంతమేర పేద విద్యార్థులకు చదువులో చేయూతనివ్వాలని ఆలోచన తో గత 19 సంవత్సరాలుగా ప్రతిస్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విద్యార్థులకునగదు ప్రోత్సాహకాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ప్రతిస్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ మాత్రమే కాకుండా తన సొంత చారిటీ ట్రస్ట్ ఎస్ కె ఎస్ ద్వారా సేవలందిస్తున్న ఎస్ కే షాజహాన్ గొప్ప ఉన్నతమైన ఆలోచనలు గల వ్యక్తిగా ఆయన ను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్ కె ఎస్ చారిటీ ట్రస్ట్ అధినేత ఎస్.కె షాజహాన్ మాట్లాడుతూ కొంతమంది ప్రతిభగలపేద విద్యార్థులు ఉన్నతమైన చదువులకు తన వంతు సహాయంగా కొంత మొత్తం వారికి అందజేయడం వలన వారి ఎదుగుదల కు చిన్న సహాయం ఎంతో ఉపయోగ పడుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంద్వారా పది మంది ఎమ్ బి బి ఎస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున లక్ష రూపాయలు అందించారు. అంతేకాకుండా ఈ ఎంబిబిఎస్ విద్యార్థులకు ఐదు సంవత్సరాల పాటు తాను ఇదే మొత్తాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆకర్షతురాలైన ట్రాన్జెండర్ అమూల్య తన వంతు సహాయంగా ఒక పేద విద్యార్థిని కి తన వంతు సహాయంగా సంవత్సరానికి 10000 చొప్పున ఐదు సంవత్సరాలపాటు 50,000 అందజేస్థానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నర్సిరెడ్డి, నీలి ప్రకాష్, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ జాను,, రిటైర్డ్ మెడికల్ ఉద్యోగి చింత సత్యనారాయణ, చీమలమర్రి మురళి, నీలి నందు, కాంగ్రెస్ నాయకులు జవ్వాది రవిచంద్ర కుమార్, విద్యార్థులు తల్లిదండ్రులు, నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.