📄 ePaper
5pm
7pm
Monday, November 30, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం   ...

జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం   * ఛీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ రామగుండం కి జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ గురించి ప్రముఖ వ్యాపార వర్గాల వారితో కలిసి లేక అందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ 

📰 Generate e-Paper Clip

జమ్మికుంట నవంబర్ 28 (ప్రజావాణి)

ఛీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ రామగుండంకి జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్ పాయింట్ గురించి ప్రముఖ వ్యాపార వర్గాల వారితో కలిసి లేక అందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట వ్యాపార వాణిజ్య కేంద్రంగా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది నాలుగు జిల్లాలకు చెందిన వందలాది గ్రామాలకు కూడలిగా స్థానిక వ్యవసాయ మార్కెట్ పరిధిలో విస్తరించి ఉంది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు కలదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, ఆయిల్ మిల్లులు, సీడ్ ప్లాంట్లు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాకు చెందిన జమ్మికుంట వీణవంక శంకరపట్నం హుజురాబాద్ మండలాలు వరంగల్ జిల్లాకు చెందిన కమలాపూర్ ఎల్కతుర్తి పర్కాల మండలాలు భూపాలపల్లి జిల్లాకు చెందిన టేకుమట్ల మొగుళ్ళపల్లి చిట్యాల మండలాలు పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీరాంపూర్ ఓదెల మండలాల పరిధిలోని గ్రామాల రైతాంగం తమ వ్యవసాయ ఉత్పత్తులైన ధాన్యం, పత్తి, మొక్కజొన్న, తదితర పంటలన్నీంటిని జమ్మికుంట సెలక్షన్ గ్రేడ్ వ్యవసాయ మార్కెట్ ద్వారా విక్రయాలు చేస్తారువారికి కావల్సిన ఎరువులు విత్తనాలు జమ్మికుంట కేంద్రంగా కొనుగోలు చేస్తారు.నాలుగు దశాబ్దాల క్రితం భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) భారీ గిడ్డంగులను నిర్మించింది. సివిల్ సప్లై కార్పోరేషన్ గోదాంలతో పాటు ప్రైవేటు గోదాములు నిర్మితమై ఉన్నాయి. జమ్మికుంటలో రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్ లేకపోవడం వల్ల సరుకుల రవాణా భారంగా మారి వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా మరింత విస్తరించి, అభివృద్ధి చెందుతుంది. కావునా జమ్మికుంటలో లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయించగలరని మనవి అని లేకలో పేర్కొన్నమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ బచ్చు భాస్కర్ జమ్మికుంట వ్యాపార వర్గాల వారు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.