📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగిరిజన గ్రామాల అభివృద్ధిలో గ్రామసభలదే కీలక పాత్ర: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో.

గిరిజన గ్రామాల అభివృద్ధిలో గ్రామసభలదే కీలక పాత్ర: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో.

📰 Generate e-Paper Clip

గిరిజన గ్రామాల అభివృద్ధిలో గ్రామసభలదే కీలక పాత్ర: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో.

ఏటూరునాగారం నవంబర్ 27, ప్రజావాణి:

పెద్దగొల్లగూడెంలో సాండ్ పేసా గ్రామసభ నిర్వహణ.. గ్రామస్థుల భాగస్వామ్యంతో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చ
పెద్దగొల్లగూడెం గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థానిక ప్రజల భాగస్వామ్యం, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య పరిపాలనను బలోపేతం చేయడంలో గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో పేర్కొన్నారు. పీఓ సూచనలు, ఆదేశాల మేరకు శుక్రవారం వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో సాండ్ పేసా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామసభలో గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రజలతో చర్చిస్తూ, గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

గ్రామసభల ద్వారా ప్రజలకు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక అవసరాలు, సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని పీఓ సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

గ్రామసభల్లో ప్రజల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, వారి అభిప్రాయాలు, సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో స్పష్టం చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.