📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:ఏ డి ఏ శ్రీనివాసరావు

వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:ఏ డి ఏ శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:ఏ డి ఏ శ్రీనివాసరావు
ప్రజావాణి,నెల్లికుదురు: నీటిపై ఆధారపడి పండే వరి సాగు బదులు ఆరుతడి పంటల వైపు రైతులు ముగ్గు చూపి సాగు చేయాలని డివిజనల్ వ్యవసాయ అధికారి అజ్మీర శ్రీనివాసరావు రైతులకు సూచించారు. సూపర్ ఎల్డినో ప్రభావం మూలంగా యాసంగి సాగులో చేపట్టాల్సిన చర్యలు,అనుసరించవలసిన పద్ధతులపై వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆలేరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశానికి ఏ డి ఏ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తలు నీటి లభ్యత తగ్గుతుందనే సూచన నేపథ్యంలో వారి సాగు చేపట్టకుండా ఆరుతడి పంటలైన జొన్న సజ్జ పెసలు మినుములు కంది వంటి పక్క దినుసుల సాగుకు పాల్పడాలన్నారు.పప్పు ధాన్యాలు సాగు చేయడం వలన భూసారం మెరుగుపడుతుందని తెలిపారు.

సబ్సిడీపై పెసర విత్తనాలు..

సబ్సిడీ పై పెసర విత్తనాలు అన్ని రైతు వేదిక లలో అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. కావలసిన రైతులు వ్యవసాయ శాఖ సూచన మేరకు రైతులు పెసర్లను పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గన్న హరీష్, ఇరిగేషన్ ఏఈ సుష్మ,పంచాయతీ కార్యదర్శి యాకుబ్, వ్యవసాయ విస్తరణ అధికారి మణికంఠ,వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్ రాజేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.