విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి
పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల తనిఖీలో మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 27
సుల్తానాబాద్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ ఉపాధ్యాయులకు సూచించారు.
శుక్రవారం సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలోని ఒకటో వార్డు సుగ్లాంపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు కృష్ణ, వార్డు కౌన్సిలర్ స్వరూప శేఖర్‌తో కలిసి సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు సరదాగా ముచ్చటిస్తూ వారి చదువులు, అభిరుచులు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.
అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ స్వరూప శేఖర్, మున్సిపల్ కమిషనర్ రమేష్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

