📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపంటల వైవిధ్యంతో రైతులకు అధిక లాభాలు: డీఏవో మోహన్ రెడ్డి

పంటల వైవిధ్యంతో రైతులకు అధిక లాభాలు: డీఏవో మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పంటల వైవిధ్యంతో రైతులకు అధిక లాభాలు: డీఏవో మోహన్ రెడ్డి
బీర్కూర్: మండలంలోని వివిధ గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్, శనగ పంటలను డీఏవో మోహన్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. శనగ పంటలో మొలకెత్తే శాతం బాగుందని, ఆయిల్‌పామ్‌తో పాటు శనగ పంటలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, ఫెర్టిలైజర్లపై పలు సూచనలు చేశారు.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) పాటించాలని సూచించారు. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా భూసారం పెరగడంతో పాటు వ్యవసాయంలో నష్టభయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ్, ఎంఏవో మహేశ్వరి, ఏఈవో మీనా, ఆయిల్‌పామ్ క్లస్టర్ ఆఫీసర్ కృష్ణమూర్తి, సీనియర్ ఆఫీసర్ వనోజ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.