📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

📰 Generate e-Paper Clip

*బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం*

*ముఖ్య అతిథి:-*
*కాదాసి రవీందర్*
*పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్*

*విశిష్ట అతిథి :-*
*ముల్కల్ల రాజేంద్రప్రసాద్*
*మంచిర్యాల జిల్లా అధ్యక్షులు*

*మన ప్రజావాణి*
*మందమర్రి*

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గం లోని మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ వద్ద గల డాక్టర్ బాబా సాహెబ్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం చెన్నూరు నియోజవర్గం అధ్యక్షులు గాజుల శంకర్ అధ్యక్షతన ముఖ్య అతిథి గా
కాదాసీ రవీందర్ విశిష్ట అతిథి గా ముల్కల్ల రాజేంద్రప్రసాద్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ముఖ్య అతిథి కాదాసి రవీందర్ మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తేదీ:-26-11-1949 న భారత రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకుందాం అన్నారు విశిష్ట అతిథి ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆర్టికల్ 3 ద్వారా నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు భారత రాజ్యాంగం ను భారత ప్రజలకు రక్ష అన్నారు చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ను పూర్తిస్థాయిలో అమలుపరచడమే బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లక్ష్యం అన్నారు
భారత రాజ్యాంగం దినోత్సవం రోజున బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలను కాన్సిరాం గారి ఆలోచనలను బావి భారత ప్రధాని కుమారి మాయావతి ఆలోచన విధానంలో ఆకర్షితులై ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ లోకి కొల్లూరు సురేష్ మరియు చిలుక వెంకటేష్ నూతనంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఈసీ నెంబర్ ఎండి మాతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దాగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుంటాల శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షులు ఆయిల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.