*తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంచాలలో ఆరుట్ల ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*
*అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు*
మంచాల, నవంబర్ 26 (ప్రజావాణి):
మంచాల మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగ చరిత్ర, రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన విశేష కృషి, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువల గురించి ఉపాధ్యాయులు వివరించారు. ముఖ్యంగా సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ పీఠికలోని ప్రధాన ఆశయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుబియానా, ఉపాధ్యాయులు దివ్య, సుమలత, గీత, భాగ్య, బాషా సర్‌తో పాటు ట్రైనీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులతో రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాలు చేయిస్తూ వారిలో దేశభక్తి, రాజ్యాంగంపై గౌరవం, పౌర బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించారు.
విద్యార్థులు చిన్ననాటి నుంచే రాజ్యాంగ విలువలను తెలుసుకొని, బాధ్యతగల పౌరులుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
మన రాజ్యాంగం – మన గర్వం!
మన హక్కులు – మన బాధ్యతలు!
రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి పునాది!
