📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్రాంపాడు సర్పంచ్ ఎన్నికల్లో నల్లేరు విశ్వనాథ రెడ్డి వర్గం ప్రభంజనం: 829 ఓట్ల భారీ మెజారిటీతో...

రాంపాడు సర్పంచ్ ఎన్నికల్లో నల్లేరు విశ్వనాథ రెడ్డి వర్గం ప్రభంజనం: 829 ఓట్ల భారీ మెజారిటీతో భూసిరెడ్డి మాధవి ఘన విజయం!

📰 Generate e-Paper Clip

కాశినాయన మండలం నవంబర్ 26ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ భరితంగా సాగిన స్థానిక పోరులో నల్లేరు విశ్వనాథ రెడ్డి తన రాజకీయ చతురతను,పట్టును నిరూపించుకున్నారు. శ్రీ అవధూత కాశినాయన మండలం రంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆయన బలపరిచిన అభ్యర్థి భూసిరెడ్డి మాధవి ఊహించని రీతిలో 829 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.వన్-సైడ్ పోరుగా సాగిన ఈ ఎన్నికల ఫలితం నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నల్లేరు విశ్వనాథ రెడ్డి నాయకత్వానికి దక్కిన ప్రజామోదం

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే రంపాడు పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది.గ్రామ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు నల్లేరు విశ్వనాథ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.ఆయన మద్దతుతో బరిలోకి దిగిన భూసిరెడ్డి మాధవి కి మొదటి నుంచి గ్రామ ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. విశ్వనాథ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి,ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ,గ్రామస్తుల కష్టసుఖాలను తెలుసుకుంటూ సాగించిన వ్యూహాత్మక ప్రచారం ఈ విజయానికి ప్రధాన పునాదిగా నిలిచింది.విశ్వనాథ రెడ్డి నాయకత్వంపై,ఆయన అందించిన భరోసాపై పూర్తి నమ్మకం ఉంచిన రంపాడు గ్రామ ప్రజలు.తమ ఓట్ల రూపంలో ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు. ప్రత్యర్థులకు కనీస పోటీ కూడా ఇచ్చే అవకాశం లేకుండా ఏకపక్షంగా ఓట్లు గుద్ది మాధవి గారిని విజయతీరాలకు చేర్చారు.విజయానంతరం సంబరాలు.. కృతజ్ఞతల జల్లాలు భారీ మెజారిటీతో భూసిరెడ్డి మాధవి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించగానే రంపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.నల్లేరు విశ్వనాథ రెడ్డి అభిమానులు, వైఎస్సార్సీపీ/ కార్యకర్తలు,రంపాడు గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ,రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.నల్లేరు విశ్వనాథ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి”అంటూ చేసిన నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది.ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి మరియు నూతన సర్పంచ్ భూసిరెడ్డి మాధవి మాట్లాడుతూ.ఈ విజయం రంపాడు గ్రామ ప్రజల విజయం అని కొనియాడారు.తమపై నమ్మకంతో ఇంతటి భారీ మెజారిటీని అందించిన గ్రామ పెద్దలకు,మహిళలకు,యువకులకు,అలాగే రాత్రింబవళ్లు శ్రమించిన పార్టీ నాయకులకు,అహర్నిశలూ కష్టపడిన కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.అభివృద్ధే ధ్యేయంగా ముందుకు.నూతన సర్పంచ్‌గా ఎన్నికైన భూసిరెడ్డి మాధవి మాట్లాడుతూ.నల్లేరు విశ్వనాథ రెడ్డి మార్గదర్శకత్వంలో రంపాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతానని హామీ ఇచ్చారు.తాగునీరు, సిమెంట్ రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం,వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.విశ్వనాథ రెడ్డి సహకారంతో మండలంలోనే రంపాడును ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా రంపాడులో నల్లేరు విశ్వనాథ రెడ్డి సాధించిన ఈ విజయం బద్వేల్ నియోజకవర్గ స్థానిక రాజకీయాల్లో ఆయన పట్టును మరోసారి చాటిచెప్పింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.