రాంపాడు సర్పంచ్ ఎన్నికల్లో నల్లేరు విశ్వనాథ రెడ్డి వర్గం ప్రభంజనం: 829 ఓట్ల భారీ మెజారిటీతో భూసిరెడ్డి మాధవి ఘన విజయం!
కాశినాయన మండలం నవంబర్ 26ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ భరితంగా సాగిన స్థానిక పోరులో నల్లేరు విశ్వనాథ రెడ్డి తన రాజకీయ చతురతను,పట్టును నిరూపించుకున్నారు. శ్రీ అవధూత కాశినాయన మండలం రంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆయన బలపరిచిన అభ్యర్థి భూసిరెడ్డి మాధవి ఊహించని రీతిలో 829 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.వన్-సైడ్ పోరుగా సాగిన ఈ ఎన్నికల ఫలితం నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నల్లేరు విశ్వనాథ రెడ్డి నాయకత్వానికి దక్కిన ప్రజామోదం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి...