*మూడు దొంగతనం కేసులలో ఒక్కొక్క కేసులో నిందుతుని రెండు సం. జైలు శిక్ష.*
నవంబర్ 26 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట :
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన మూడు దొంగతనం కేసులలో ఒక్కొక్క కేసులో నిందుతుడు అయిన మోకానపల్లి బాబు అనే నిందుతునికి ఒక్కొక్క కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష , 500 రూపాయల జరిమాన విధిస్తు గురువారం రోజున గౌరవ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కొనరావుపేట ఎస్.ఐ B. రామ్ మోహన్ తెలిపారు.
Case.1: కోనరావుపేట మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన నాలుగు శంకర్ తండ్రి పేరు కాశయ్య అనే వ్యక్తి యొక్క ద్విచక్ర వాహనంపైన తేదీ 25.01.2026 రోజున వెంకట్రావుపేటకు చెందిన సందు సాయికుమార్ తండ్రి పేరు శంకర్ అనే వ్యక్తి లిఫ్ట్ అడగగా అతనిని ఎక్కించుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో ఆగి షాప్ కు వెళ్లి వచ్చి చూసేసరికి అతని బండి కనిపించలేదు. సందు సాయి తీసుకువెళ్లాడని తిరిగి వస్తాడేమో అని చాలా సేపు ఎదురు చూసినప్పటికీ అతడు తిరిగి రాకపోవడంతో సందు సాయి దొంగతనంగా అతని బండిని తీసుకువెళ్లాడని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది.
Case .2: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన మామిళ్ళ నాగయ్య తండ్రి పేరు భూమయ్య అనే వ్యక్తి తేదీ 8.08 2025 రోజున నిజామాబాద్ గ్రామ శివారులోని తను అధ్యక్షుడిగా పనిచేస్తున్న పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లి చూడగా గుడి తలుపుల యొక్క తాళం పగలగొట్టబడి ఉండి అందులో దాదాపు పదివేల రూపాయల విలువగల వస్తువులు కనబడకపోయేసరికి పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది
Case.3: కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన నేరెళ్ల శ్రీనివాస్ తండ్రి పేరు ముత్తయ్య అను వ్యక్తి తేదీ 18 5 2026 రోజున కోనరావుపేట పోలీస్ స్టేషన్లో తాను అధ్యక్షుడిగా పనిచేస్తున్న గౌడ సంఘం కు చెందిన సుద్దాల గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద రాత్రిపూట దొంగతనం జరిగింది అని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు హుండీని దొంగలించారు అని మొత్తం దాదాపు 15 వేల రూపాయల వరకు నష్టం జరిగింది అని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది
కోర్టు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ గారు వాదించగా, ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడైన మొకనపల్లి బాబు కి ఒక్కొక్క కేసులో రెండు సంవత్సరాలు జైలు శిక్ష,500 రూపాయల జరిమాన తీర్పు వెల్లడించినట్లు కొనరావుపేట SI B. రామ్ మోహన్ తెలిపారు.

