📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఅవినీతిని కప్పు పుచ్చేందుకు అధికారులా కుస్తీలు..? మళ్లీ విచారణ మళ్ళీ...

అవినీతిని కప్పు పుచ్చేందుకు అధికారులా కుస్తీలు..? మళ్లీ విచారణ మళ్ళీ నోటీసులు..? ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో గత రెండు నెలలుగా నలుగుతున్న వ్యవహారం..!

📰 Generate e-Paper Clip

అవినీతిని కప్పు పుచ్చేందుకు అధికారులా కుస్తీలు..?

 

మళ్లీ విచారణ మళ్ళీ నోటీసులు..?

 

 

ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో గత రెండు నెలలుగా నలుగుతున్న వ్యవహారం..!

 

 

పంచాయతీ రికార్డులలో అక్రమాలు దాంతో జిల్లాలోని ఓ సబ్ రిజిస్టర్ అక్రమ రిజిస్ట్రేషన్..?

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి

 

ఖమ్మం జిల్లా లో ఓ పంచాయతీలో జరిగిన అక్రమాలపై బాధితులు ఇటీవల జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జనవరి 8వ తారీఖున విచారణ చేసిన జిల్లా ఇన్చార్జి డిపిఓ సమగ్రంగా వీడియో రికార్డు తో పాటు.. వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ కు రిపోర్ట్ చేస్తా ఉంటూ అన్నారు. కాగా దీంతో మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి సమగ్ర సంచలన కథనం అందించిన నేపథ్యంలో మళ్లీ నోటీసులు వాట్సాప్ ద్వారా జారీ చేశారు. నేడు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో హాజరుకావాలంటూ అవినీతి అక్రమాలకు పాల్పడిన ఓ పంచాయతీ కార్యదర్శి తో పాటు ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి కి మండల పంచాయతీ అధికారిణికి సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాలోని ఓ పంచాయతీ కార్యదర్శి బాధిత కుటుంబానికి విచారణకు హాజరు కావాలంటూ అన్నారని సమాచారం అందుతోంది. కాగా 2013 2017 లో అనేక అక్రమాలు జరిగినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రజా ప్రభుత్వం సుమోటోగా స్వీకరించిన విచారణ అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులపై అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సదరు సబ్ రిజిస్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకునేందుకు ఆమేరకు జిల్లా కలెక్టర్ ఆదేశించాలని బాధిత కుటుంబం కోరుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.